- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shanmukha: రిలీజ్‌కు సిద్ధమైన డివోషనల్ థ్రిల్లర్ మూవీ.. పోస్టర్ వైరల్

దిశ, సినిమా: ఆది సాయి కుమార్ (Adi Sai Kumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటిస్తోన్న డివోషనల్ థ్రిల్లర్ (devotional thriller) చిత్రం ‘షణ్ముఖ’ (Shanmukha). సాప్పాని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సుబ్రహ్మణ్య స్వామి (Subrahmanya Swamy) ఆలయం నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమాకు ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా.. అతడి బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంబోతుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘షణ్ముఖ’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆది సాయి కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించగా.. హై స్టాండర్డ్ విజువల్స్ ఎఫెక్ట్స్ (High standard visuals effects), గ్రాఫిక్స్ (Graphics)తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దున్నామని డైరెక్ట్ అన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైనట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘షణ్ముఖ’ 2025 మార్చి 21న పెద్ద స్క్రీన్‌లపైకి రావడానికి సిద్ధంగా ఉంది.. విజువల్స్ వండర్‌ను ఎక్స్‌పీరియన్స్ (Experience) చెయ్యడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రజెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
#Shanmukha is all set to hit the big screens on 21st March 2025!
— Vamsi Kaka (@vamsikaka) March 1, 2025
🎬 Directed by @shanmugamsappani
🎶 Music by BGM King Ravi Basrur
🎥 Produced by Sapbro Productions#Shanmukha #WhoIsShanmukha #March21 #SapbroProductions #MysteryUnfolds pic.twitter.com/ilWbN55B6q