- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘వారి విలువ కోల్పోయిన వాళ్లకే తెలుస్తోంది’.. ప్రముఖ నటుడు ఎమోషనల్ పోస్ట్!

దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో నటుడిగా, క్యారెక్టర్ అర్టిస్టుగా, దర్శకుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ గురించి సుపరిచితమే. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)కి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే.. నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషాద వార్తను నటుడు రాహుల్ రవీంద్రన్(Ravindran Narasimhan) సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు.
‘‘ఆయన తన జీవితంలో కష్టపడి, నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపారు. మీరు మీ జ్ఞాపకాలలో సజీవం గా ఉంటారు. నాన్న ఉన్నారులే చూసుకుంటారు అనే మాటకి విలువ నాన్నని కోల్పోయిన వాళ్లకే తెలుసు. నాకు ఈ రోజు తెలుసు. ఎప్పటికి మీ జ్ఞాపకాలు నాలో బతికే ఉంటాయి నాన్న’’ అంటూ రాహుల్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషాద సమయంలో తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) కు అండగా నిలుస్తున్నారు.