- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ కలిసిపోతున్న జంట.. పోస్ట్‌తో హింట్ ఇచ్చారుగా అంటున్న నెటిజన్లు!

దిశ, సినిమా: స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) స్టార్ హీరోల చిత్రాలకు వర్క్ చేస్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఏఆర్, రెహమాన్ రామ్ చరణ్ ‘RC-16’ కు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్(Ram Charan) సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఏఆర్ రెహమాన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత ఏడాది ఆయన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
నవంబర్ 19న అధికారిక ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. రెహమాన్ దగ్గర పని చేస్తున్న జూనియర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండటం వల్ల సైరాతో విడిపోయినట్లు పలు పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏఆర్ రెహమాన్ స్పందించారు. తమ వ్యక్తిగత అంశమని దయచేసి దీని మీ చర్చలు పెట్టొద్దని అలా చేస్తే చట్టపరంగా ముందుకు వెళ్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా భాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో అడ్మిట్ అవగా..సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. విడాకులు సమయంలో సైరా తరపున వాదించిన లాయర్ ఈ విషయంపై పోస్ట్ పెట్టింది.
సైరా కష్టసమయంలో ఉంటే ఏఆర్ రెహమాన్ ఆమె సపోర్ట్‌గా నిలిచారని నోట్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తన మాజీ భార్యతో విడిపోయినప్పటికీ నాకేంటని వదిలేయకుండా ఏఆర్ రెహమాన్ సపోర్ట్‌గా ఉండటం గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం త్వరలోనే వీరిద్దరు మళ్లీ కలిసిపోతారని చర్చించుకుంటున్నారు. ఈ పోస్ట్ చూస్తేనే అర్థం అవుతోంది హింట్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ భార్యతో ఏఆర్ రెహమాన్ కలిసిపోతున్నాడనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.