- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
sun shines 24 hours: పగలు రాత్రి తేడా లేదు.. 24 గంటలు సూర్యుడు ఉంటాడు!
దిశ, సినిమా: సాధారణంగా రోజులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుందనేది అందరికి తెలిసిందే. ఇక వాతావరణ పరిస్థితుల రిత్యా ఒక గంట అటూ ఇటూగా పగలు, రాత్రులు మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా వేసవి టైంలో పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా ఉంటోంది. అలాగే శీతాకాలంలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కానీ, భూమీ మీదా కొన్ని ప్రాంతల్లో సూర్యోదయం అయిందంటే మళ్లీ కొన్ని నెలల వరకు సూర్యస్తమయం ఉండదు. 24 గంటలు వెలుతురు ఉంటోంది. ఆ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ ల్యాండ్ (ice land): ఈ దేశంలో రేక్జావిక్ సహా పలు ప్రాంతాల్లో మే నెల మధ్య నుంచి జూలై మధ్య వరకు 24 గంటలు సూర్య కిరణాలు ప్రసరిస్తూనే ఉంటాయి.
కెనడా (Canada)లలోని నునావుట్ (Nunavut), యుకున్ (Yukun): ఇక్కడ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ మధ్య వరకు 24 గంటలు సూర్యుడు కనిపిస్తాడు.
గ్రీన్ ల్యాండ్ (Greenland)లోని ఖానాక్ (Khanak): ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఖానాక్ ఒకటి. ఇక్కడ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ లాస్ వీక్ వరకు నిరంతంరం సూర్యుడు ప్రసరిస్తూనే ఉంటాడు.
రష్యా (Russia)లోని ముర్మానస్క్ (Murmansk): ఈ ప్రాంతంలో మే మధ్య నుంచి జూలై మధ్య వరకు దాదాపు 62 రోజుల పాటు 24 గంటులు సూర్యుడు కనిపిస్తాడు.
నార్వే (Norway)లోని స్వాల్ బార్డ్ (swal bard) ప్రాంతం: ఇది ఎక్కువగా పర్యాటకులు వచ్చే ప్రాంతం. ఇక్కడ ఏప్రిల్ చివరి నుంచి ఆగస్ట్ చివరి వరకు సూర్యుడు 24 గంటలు కనిపిస్తాడు.
యూఎస్ఏ (USA)లోని అలాస్కా (Alaska): అమెరికాలోని ఉత్తర ప్రాంతమైన అలాస్కాలో కూడా మే మధ్య నుంచి ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు సూర్యుడు ప్రసరిస్తాడు.
స్వీడన్ (Sweden) లోని అబిస్కో అబిస్కో: ఇక్కడ మే మొదటి వారం నుంచి జూలై మధ్య వరకు 24 గంటలు సూర్యుడు కనిపిస్తాడు.