Chandoo Mondeti: ‘కార్తికేయ-3’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. క్యూరియాసిటీ పెంచుతున్న కామెంట్స్

by Kavitha |
Chandoo Mondeti: ‘కార్తికేయ-3’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. క్యూరియాసిటీ పెంచుతున్న కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరో నిఖిల్(Nikhil) నటించిన ‘కార్తికేయ’(Karthikeya) మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయిన ఆయన.. తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత నాగ చైతన్య(Naga Chaitanya)తో ‘ప్రేమమ్’(Premam) మూవీని తెలుగులో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత సవ్యసాచి(Savyasachi)తో విమర్శలు ఎదుర్కొన్న చందూ.. కార్తికేయ సీక్వెల్‌ ‘కార్తికేయ-2’(Karthikey-2)తో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం నాగ చైతన్యతో ‘తండేల్’(Thandel) మూవీ చేస్తున్నాడు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌(Geeth Arts Banner)పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. యథార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లవర్స్ కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చందూ మొండేటి ‘కార్తికేయ-3’(Karthikeya-3) మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘తండేల్ పని పూర్తి అవ్వగానే కార్తికేయ-3 స్టార్ట్ చేస్తాను. కార్తికేయ-2 సక్సెస్ తర్వాత నా మీద ఎలాంటి ఎలాంటి బాధ్యత ఉందో నాకు తెలుసు. మీకు మీటిస్తున్నాను పార్ట్ త్రి వేరె లెవెల్‌లో ఉంటుంది. ఈ మూవీ కోసం నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అలాగే ఈ సినిమా కోసం లోకెషన్ల వేట కూడా పూర్తి చేశాను. నేను కృష్ణుడు గురించి జనాలకి చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మొత్తానికి కార్తికేయ-2తో కృష్ణ భగవానుడు(Lord Krishna) నాకు గొప్ప జీవితాన్ని, కెరీర్‌ను ప్రసాదించాడు.

నేనిప్పుడు భక్తి పూర్వకంగా నీ కృతజ్ఞతను చాటుకోవాలి. ఈ థర్డ్ పార్ట్ కృష్ణ భగవానుడి చుట్టూనే తిరుగుతుంది. కార్తికేయ-2 చూశాక చాలా మంది పిల్లలు కృష్ణుడి గురించి, గోవర్ధన గిరి గురించి పెద్ద వాళ్లను అడిగి తెలుసుకుంటున్నారని తెలిసింది. అందుకు నేను చాలా సంతోషించాను. నేను మన మూలాలు, సంస్కృతి, పురాణాల మీద మరిన్ని కథలు చెప్పాలనుకుంటున్నా’ అని చందూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



Next Story

Most Viewed