Sandeep Raj: పెళ్లితో ఒక్కటైన కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్, నటి చాందినీ రావు

by Prasanna |
Sandeep Raj: పెళ్లితో ఒక్కటైన కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్, నటి చాందినీ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : కలర్ ఫోటో ( Colour Photo ) ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ( Sandeep Raj ) రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి మనకీ తెలిసిందే. అయితే, నేడు తిరుపతిలో చాందినీ రావు ( Chandni Rao) మెడలో వేదం మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు వేసి భార్యగా చేసుకున్నాడు. వీరిద్దరి వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు మాత్రమే అటెండ్ అయ్యారు.

ఈ పెళ్ళికి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి నటి దివ్య శ్రీపాద, నటుడు వైవా హర్ష, యాంకర్ సుమ కొడుకు రోషన్, నటి ప్రియా వడ్లమాని ఉన్నారు. అంతే కాకుండా, కలర్ ఫోటోలో నటించిన నటీ నటులు మొత్తం ఈ పెళ్ళికి హాజరయ్యారు. హీరో సుహాస్ తో కలర్ ఫోటో నుంచి సందీప్ రాజ్ తో మంచి బాండింగ్ ఉంది.

ప్రస్తుతం, సందీప్ రాజ్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక చాందిని, సందీప్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆయన చేసిన కొన్ని సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ కూడా నటించింది. అలాగే, రంగస్థలంలో సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించి అందర్ని మెప్పించింది.

Next Story

Most Viewed