- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బన్నీ నువ్వు నా కొడుకు లాంటి వాడివి.. రాజేంద్ర ప్రసాద్.. కవరింగ్ మామూలుగా లేదంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: మ్యాగీ దర్శకత్వంలో శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘హరికథ’. ఈ సిరీస్‌లో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక హరికథ ఈ నెల 13 నుంచి డిస్ని ఫ్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే రీసెంట్‌గా హైద్రాబాద్‌లో ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించారు. ఇక కార్యక్రమంలో పాల్గొన్న నటకిరీటీ మాట్లాడుతూ.. “ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూశాం, వాడెవడో చందనం దొంగ, వాడు హీరో. హీరోల్లో మీనింగ్ మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను 48 సంవత్సరాలుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్‌తో డిఫరెంట్ హీరో అనిపించుకున్నాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపాయి.
కాగా ‘పుష్ప 2’ మూవీని ఉద్దేశించే నట కిరీటి ఈ కామెంట్స్ చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం ముదరడంతో తాజాగా దీనిపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్‌ని ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ. నేను పుష్ప సినిమాపై నెగిటీవ్‌గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా కొత్తగా ఇది వచ్చింది అంటూ ఎంజాయ్ చేశాను. కానీ, ఇది చేసింది ఎవరో కానీ వాడికి ఒక్కటే చెబుతున్నాను. అది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి అనలేదు. వాడు నా కొడుకు లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారగా.. కవరింగ్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read More...
Pushpa 2: ‘పుష్ప 2’ కలెక్షన్ల సునామీ.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు