Brahmanandam: ఆయన చివరి క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.. బ్రహ్మానందం ఎమోషనల్ కామెంట్స్

by sudharani |
Brahmanandam: ఆయన చివరి క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.. బ్రహ్మానందం ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam), అతని కుమారుడు రాజా గౌతమ్ (Raja Gautham) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam). శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో యంగ్ డైరెక్టర్ Rvs నిఖిల్ తెరకెక్కించిన ఈ మూవీ.. ఈ రోజు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఫుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ (family entertainer)గా ప్రజెంట్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం తన కో యాక్టర్ MS నారాయణ (MS Narayana) చివరి క్షణాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘MSతో నాకు మంచి బాండింగ్ ఉంది. షూటింగ్ సెట్స్‌లో కూడా న‌న్ను అన్నయ్య అంటూ పిలిచేవాడు. అతనికి ఎంతోమంది ప్రముఖులు తెలుసు.. బంధువులు, ఫ్రెండ్స్ అతడి చుట్టూనే ఉన్నారు. కానీ చావు బతుకుల మధ్య పోరాడుతున్న సమయాల్లో అతడి చివరి క్షణాల్లో నన్ను చూడాలి అనుకున్నాడు. బెడ్‌పై ఉండి నోటితో మాట్లాడ‌లేని పరిస్థితుల్లో ఓ కాగీతంపై బ్రహ్మనందం అన్నయ్యను చూడాల‌ని ఉంద‌ని రాసి తన కూతురుకి ఇచ్చాడు. దీంతో నాకు వెంట‌నే ఎంఎస్ కూతురు కాల్ చేసింది. నేను అప్పుడు గోపిచంద్ (Gopichand) సినిమా (ఆర‌డుగుల బుల్లెట్) షూటింగ్‌లో ఉన్నాను. ఈ విషయం తెలియగానే ఎవరికి ఇన్ఫామ్ చెయ్యకుండా అక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్లాను. ఎంఎస్‌ నారాయణ న‌న్ను చూడగానే నా చేయి గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. ఆ క్షణాన్ని నేను ఎప్పటికి మర్చిపోలేను. అత‌డిని క‌లిసిన త‌ర్వాత డాక్టర్‌ని ఎంత ఖ‌ర్చు అయిన ప‌ర్వాలేదు బ్రతికించండి అని వేడుకున్నాను. ఆ తర్వాత కుటుంబసభ్యులతో మాట్లాడి మ‌ళ్లీ షూటింగ్‌కి బయలుదేరా. ఈ మధ్య దారిలో ఉండగానే.. తను చనిపోయినట్లు వార్తలు వచ్చాయి’ అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed