Ram Charan:క్రేజీ న్యూస్.. రామ్ చరణ్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో?

by Jakkula Mamatha |
Ram Charan:క్రేజీ న్యూస్.. రామ్ చరణ్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో?
X

దిశ,వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించారు. అయితే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో మరో మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ రామ్ చరణ్ ఫోకస్ మొత్తం తన తదుపరి సినిమా ‘RC 16’ పై ఉంది. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న ‘ఆర్ సి 16’ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.

ఈ క్రమంలో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘RC16’లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbeer Kapoor) నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రణ్‌బీర్‌కు దర్శకుడు కథ వినిపించగా ఆయన ఒకే చెప్పారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం.

Next Story

Most Viewed