Jr NTR: ఎన్టీఆర్ కు బిగ్ షాక్.. వరుస ఎదురుదెబ్బలు తింటున్న తారక్.. ఆ మూవీకి పెద్ద బ్రేక్ పడినట్టే?

by Prasanna |   ( Updated:2025-01-17 12:50:58.0  )
Jr NTR: ఎన్టీఆర్ కు బిగ్ షాక్.. వరుస ఎదురుదెబ్బలు తింటున్న తారక్.. ఆ మూవీకి పెద్ద బ్రేక్ పడినట్టే?
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై ( Saif Ali Khan ) ) దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే, ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడటంతో కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు, సైఫ్ చేయబోయే సినిమాలకు పరిస్థితి ఏంటో అర్ధం కాకుండా ఉంది. వాటిలో " దేవర 2 " ( Devara 2 ) కూడా ఉంది.

సైఫ్ అలీఖాన్ చేతిలో జువెల్ థీఫ్, దేవర 2 మూవీస్ ఉన్నాయి. జువెల్ థీఫ్ షూటింగ్ జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 లో సైఫ్ విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా ఇతని పాత్ర తప్పక ఉంటుంది. దీంతో, సైఫ్ త్వరగా కోలుకోకపోతే ఎన్టీఆర్ ( NTR) పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవర 2 షూటింగ్ మొదలవ్వడానికి ఆరు నెలల సమయం పడుతుంది.

మరి, ఈ లోగా సైఫ్ అలీఖాన్ కోలుకుంటాడా? లేకపోతే దేవర 2 ( Devara 2 ) ను ఇప్పుడు మర్చిపోయి తర్వాత గుర్తు చేసుకోవాలా అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. " ఎన్టీఆర్ కే ఎందుకు ఇలా జరుగుతుందంటూ.." నెటిజన్స్ కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు. దీని వలన ఎన్టీఆర్ కు మాత్రమే కాకుండా అతని ఫ్యాన్స్ కూడా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే , ఈ మూవీ వలన ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. మళ్లీ ఇప్పుడు ఇలా అయింది. సైఫ్ త్వరగా కోలుకోవాలని ఎంతోమంది సోషల్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed