- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన బలగం బ్యూటీ.. అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందంటూ కామెంట్స్

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘గంగోత్రి’(Gangothri) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే మరికొన్ని చిత్రాల్లో బాల నటిగా నటించింది. ఇక రీసెంట్‌గా జబర్దస్త్ ఫేమ్ వేణు(Venu) డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’(Balagam) సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఈ మూవీ ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దీంతో ఈ అమ్మడు గ్రాఫ్ అమాంతం చేంజ్ అయిపోయి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు.
కానీ ప్రజెంట్ చేతిలో సినిమాలు లేక సోషల్ మీడియా(Social Media)కే పరిమితం అయింది. అక్కడ తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా కావ్య.. తన ఇన్‌స్టా9Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆరెంజ్ కలర్ బ్లౌజ్, పింక్ కలర్ శారీ కట్టుకొని, జడలో పూలు పెట్టుకుని సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చింది. అంతేకాకుండా వీటికి ‘పెళ్లి సీజన్ డంప్’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.