గ్రీన్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న బలగం బ్యూటీ.. సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-12-31 02:46:18.0  )
గ్రీన్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న బలగం బ్యూటీ.. సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ చేసిన ఈ బ్యూటీ ‘మసూద’ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ తర్వాత జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి తెరకెక్కించిన ‘బలగం’ సినిమాలో నటించింది. ఈ మూవీతో ఏకంగా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లు వచ్చి హీరోయిన్‌గా ఓ రేంజ్‌కి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ, ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు.

దీంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం తన అందాలతో కుర్రకారు మనసుల్ని కట్టిపడేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా కావ్య తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా ‘క్రిస్మస్ ట్రీకి ఇదొక వర్షన్’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు వావ్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed