బాహుబలి నిర్మాత వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. దయచేసి సమస్యను పరిష్కరించండి అంటూ ట్వీట్

by Hamsa |
బాహుబలి నిర్మాత వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. దయచేసి సమస్యను పరిష్కరించండి అంటూ  ట్వీట్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా(Social Media) అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. తాజాగా, బాహుబలి ఫ్రాంఛైజీ నిర్మాత శోభు యార్లగడ్డ(Shobhu Yarlagadda) హ్యాకర్స్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ‘X’ ద్వారా ట్వీట్ చేశారు. ‘‘నా వాట్సాప్ అకౌంట్(WhatsApp account) హ్యాక్ చేయబడింది. నా ఖాతా హ్యాకర్ కంట్రోల్‌లో ఉంది. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే.. వాట్సాప్‌ను నేను మరో 12 గంటల పాటు తిరిగి లాగిన్ అవ్వడానికి అనుమతి లేదు. దీనికి కారణం నేను ఇప్పటికే చాలాసార్లు తప్పు పిన్‌ను ఎంటర్ చేశాను.

ఈ సమయంలోనే నా కాంటాక్ట్‌లో ఉన్న చాలామంది వ్యక్తులను హ్యాకర్స్ మోసం చేశారు. నా వాట్సాప్‌ను చేరుకునే చాన్స్ లేదు. దయచేసి నా సమస్య గురించి ఏదైనా చేయండి దానిని పరిష్కరించండి’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా @Meta@WhatsAppను ట్యాగ్ చేశారు. కాగా, శోభు యార్లగడ్డ ‘బాహుబలి’ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాడు. ప్రజెంట్ వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్‌గా వరుస చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వాట్సాప్ హ్యాక్ కావడంతో నెటిజన్లు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story

Most Viewed