Kannappa: పూర్తి రూపాన్ని మిస్ అవ్వకండి!.. కన్నప్ప నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

by sudharani |   ( Updated:2024-11-30 16:17:58.0  )
Kannappa: పూర్తి రూపాన్ని మిస్ అవ్వకండి!.. కన్నప్ప నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
X

దిశ, సినిమా: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa). అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ (April) 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘కన్నప్ప’ చిత్రం నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ తదితరుల పాత్రలకు సంబంధించి లుక్‌ను విడుదల చేయగా.. తాజాగా మరో పోస్టర్ విడుదల చేశారు. ఈ మేరకు ‘కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతుంది! ‘కన్నప్ప’లో అరియానా (Ariana) & వివియానా (Viviana) ప్రీ-లుక్‌ని విడుదల చేశాము. వారి అపురూపమైన అంకితభావం ఈ పవిత్రమైన కథకు తాజా మెరుపును తెస్తుంది. డిసెంబర్ 2న పూర్తి రూపాన్ని మిస్ అవ్వకండి!’ అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు.

Read More...

‘మంత్రి లోకేష్ పాజిటివ్ ఎనర్జీ సూపర్’.. మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు


Advertisement
Next Story

Most Viewed