- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి అర్చన అయ్యర్ ఫస్ట్ లుక్.. ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న నటి

దిశ, సినిమా: ‘కృష్ణమ్మ’(Krishnamma) చిత్రంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అర్చన అయ్యర్ (Archana Iyer)నటిస్తు్న్న తాజా చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. (Shambhala: A Mystical World)సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అర్చన అయ్యర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘శంబాల’ నుంచి తాజాగా ఈ నటి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో అర్చన అయ్యార్ పాత్రను ‘దేవీ’గా రివీల్ చెయ్యగా.. ఎరుపు రంగు చీరలో ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించిన అయ్యార్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్‌లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా చాలా క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. అంతేకాకుండా.. పోస్టర్లతోనే ‘శంబాల’ చిత్రంపై అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది చిత్రయూనిట్. యుగంధర్ ముని(Director Yugandhar Muni) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్(Adi Saikumar) జియో సైంటిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో జరుగుతోంది.