- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో మరో సీక్వెల్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే?

దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Director Prashant Verma)కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ చిత్రం (Hanuman movie)ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుందో తెలిసిందే. దీంతో హీరో తేజాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కూడా పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ వచ్చింది. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’(Jai Hanuman) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘జై హనుమాన్’ కాకుండా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో ఇప్పుడు మరో సీక్వెల్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తేజ, ప్రశాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘జాంబీ రెడ్డి’(Zombie Reddy). యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ వర్మ. అంతే కాకుండా దీనికి సంబంధించిన కథను ఇప్పటికే రాయడం స్టార్ట్ చేశాడట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుండగా.. దీనికి మరొకరు దర్శకత్వం వహించనున్నారు. అయితే.. తేజ సజ్జా ప్రస్తుతం ‘మిరాయ్’ (Mirai)షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను పూర్తి చేయడానికి కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తయిన తర్వాత, అతను జాంబీరెడ్డి 2(Zombie Reddy-2) షూటింగ్‌లో జాయిన్ అవుతాడని ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.