Anasuya Bharadwaj: ‘నాగబంధం’ సినిమాలో వెర్సటైల్ యాక్టర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న రాయల్ లుక్ పోస్టర్

by sudharani |
Anasuya Bharadwaj: ‘నాగబంధం’ సినిమాలో వెర్సటైల్ యాక్టర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న రాయల్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ (Virat Karna) నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్‌ (Highly anticipated) పాన్‌ ఇండియా మూవీ (Pan India Movie) ‘నాగబంధం’ (Nagabandham). ప్యాషనేట్‌ ఫిల్మ్‌ మేకర్‌ అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. ‘ది సీక్రెట్‌ ట్రెజర్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఎపిక్‌ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది. పురాణ ఇతిహాసాల (Mythology) నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో ఈ సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘నాగబంధం’ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుపుతూ... ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్న ఫోటో షేర్ చేశారు. రాయల్ లుక్‌ (Royal look)లో కనిపిస్తున్న చేతులుని ప్రజెంట్ చేసే ఈ ఫోటో చాలా క్యురియాసిటీ (Curiosity) పెంచింది. కాగా.. ఈ చిత్రంలో నభా నటేష్ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్ (Aishwarya Menon) హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, రిషభ్‌ సహానీ, జయప్రకాష్, జాన్‌ విజయ్‌, మురళీ శర్మ, శరణ్య, ఈశ్వరి రావు, జాన్‌ కొక్కిన్‌, అంకిత్‌ కొయ్య, సోనియా సింగ్‌, మాథ్యూ వర్గీస్‌, జాసన్‌ షా, బి.ఎస్.అవినాష్, బేబి కియరా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది.

Next Story

Most Viewed