Amala: కాబోయే కోడలి గురించి తొలిసారిగా మాట్లాడిన అమల.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

by Anjali |
Amala: కాబోయే కోడలి గురించి తొలిసారిగా మాట్లాడిన అమల.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సతీమణి అమల(Amala) తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో పోషించిన పాత్రల కన్నా.. రియల్ లైఫ్ లో పోషించిన ప్రతి పాత్ర ఎంతో సంతోషానిచ్చాయని వెల్లడించారు. కోడలిగా, భార్యగా, ఒక తల్లిగా నాకు చాలా ప్రత్యేకమైన పాత్రలని తెలిపారు. ఇదంతా ఒక అద్భుతమైన జర్నీ అని పేర్కొన్నారు. అలాగే సిసీ ఇండస్ట్రీలోకి వచ్చే యువతులకు మీరేం సలహా ఇస్తారని అడగ్గా.. ఎలాంటి సందేహం లేకుండా రండని.. అమ్మాయిలకు ధైర్యానిస్తానని అమల తెలపారు. మరీ మీ కాబోయే కొత్త కోడలికి మీరిచ్చే సలహా ఏంటని ప్రశ్రించగా.. తను చాలా ఇంటెలిజెంట్(intelligent) అని.. మెచ్యూర్డ్(matured) మహిళ అని పేర్కొంది.

ఆమెకు ప్రత్యేకంగా నేను ఇచ్చే సలహాలంటూ ఏమీ లేవని అమల చెప్పుకొచ్చింది. కానీ మంచి భార్యగా ఉండాలని నా కోరిక అని వెల్లడించింది. అంతా కూడా కొత్త జంట ఫ్యూచర్ బాగుండాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపింది. అలాగే ఇంటర్నేష్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(International Film Festival of India)లో ఇటీవల అమల పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా దీనిపై ఆమె మాట్లాడారు. స్టార్టింగ్ కార్యక్రమం నుంచే ఇఫీ చాలా బాగా నచ్చిందని, బొమన్ ఇరానీ లెజెండ్స్(Boman Irani Legends) గురించి అయితే ఎంతో చక్కగా చెప్పారని వెల్లడించింది. ప్రపంచ సినిమాను.. భారతీయ మూవీని ఒకే చోట చేర్చడం నిజంగా అద్భుతమని అన్నారు. ఇలాంటి ఈవెంట్స్ చాలా అవసరమని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed