- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: అల్లు అర్జున్ పై నిందలు వేస్తే ఏ నాయకుడైనా నాశనం అయిపోతారు.. రచయిత చిన్ని కృష్ణ ఎమోషనల్
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun)కు మరక అంటించాలని చూస్తే నాశనం అయిపోతారని సినీ రచయిత చిన్ని కృష్ణ(Movie Writer Chinni Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా గంగోత్రి(Gangothri) రాసింది తానేనని అన్నారు. అల్లు అర్జున్ అంటే తనకు ప్రాణం అని, ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి పచ్చి మంచి నీళ్లు ముట్టలేదని, చంచల్ గూడ జైలు(ChanchalGuda Jail) నుంచి ఇప్పుడే వచ్చామని తెలిపారు.
గంగా నదిలో స్నానం చేసి గంగోత్రి సినిమా చేసిన అల్లు అర్జున్ కు మరకలు అంటించాలని చూస్తే ఏ రాజకీయ నాయకుడైనా(Political Leader).. ఏ ప్రభుత్వమైనా(Government) సర్వనాశనం అయిపోతారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ సినిమాల ద్వారా ఈ ప్రపంచానికి కొత్త నిర్వచనం చెప్పారని, అలాంటిది ఆయనపై నిందలు వేయడం, అరెస్ట్ చేయడం.. అమానుషం, నీచం, నికృష్టం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు. నాంపల్లి కోర్టు(Nampally Court) 14 రోజుల రిమాండ్(Remand) విధించింది. హైకోర్టు(High Court) మధ్యంతర బెయిల్(Bail) మంజూరు చేయడంతో ఇవాళ ఉదయం చంచల్ గూడ జైలు అధికారులు ఆయనను విడుదల చేశారు.