- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arha: డాడీ కోసం అల్లు అర్హ ఎదురు చూపులు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 6.39 నిమిషాలకు చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన భార్య, పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. కాగా సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
అనంతరం జైలుకు తీసుకెళ్లేలోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగ్గా లేదని చంచల్ గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉన్నారు. అయితే తన తండ్రి రాక కోసం తెల్లవారుజాము నుంచే అల్లు అర్హ ఎదురుచూస్తుంది. ఇక ఈ వీడియోలో గేట్ ముందు ఉన్న అభిమానులందరికీ అర్హ హాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.