- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా డ్రీమ్.. ఐశ్వర్య రాజేశ్ కామెంట్స్ వైరల్
![ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా డ్రీమ్.. ఐశ్వర్య రాజేశ్ కామెంట్స్ వైరల్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా డ్రీమ్.. ఐశ్వర్య రాజేశ్ కామెంట్స్ వైరల్](https://www.dishadaily.com/h-upload/2025/01/25/414688-iw.webp)
దిశ, సినిమా: హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) ప్రజెంట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఐశ్వర్య రాజేశ్ ‘భాగ్యం’ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాకుండా ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో అమాంతం క్రేజ్ పెంచేసుకున్న ఈ బ్యూటీకి ప్రజెంట్ వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య స్టార్ హీరో ఎన్టీఆర్(NTR)పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది.
‘ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం. ఆయనను స్టూడెంట్ నెం. 1 సినిమా నుంచి చూస్తున్నాను.. ఆయన డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోను. ఆయనతో వర్క్ చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నాను.. ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదని.. భవిష్యత్తులో వస్తే కచ్చితంగా చేస్తాను’ అని చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ (War 2)తో బిజీగా ఉన్నాడు. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం ‘దేవర’ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.