ఆకట్టుకున్న సృజన వంక కూచిపూడి నృత్యం

by Kavya |   ( Updated:2025-04-25 15:41:46.0  )
ఆకట్టుకున్న సృజన వంక కూచిపూడి నృత్యం
X

దిశ, రవీంద్రభారతి : సృజన వంక కూచిపూడి నృత్యం వీక్షకులను ఆకట్టుకుంది. ఇత్తడి పళ్లెం అంచుపై నృత్యకారిణి ప్రదర్శన అబ్బురపరిచింది. దీపాంజలి స్కూల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కూచిపూడి విద్యార్థి సృజన వంక శుక్రవారం రవీంద్రభారతి ప్రధానమందిరంలో కూచిపూడిలో రంగాప్రవేశం చేశారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి, పద్మశ్రీ డా. పి. రఘురామ్, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీ.జే. నారాయణ్, ప్రొఫెసర్ అరుణ భిక్షు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ..సృజన వంక, ఆరేళ్ల వయస్సులో కూచిపూడికి పరిచయమయ్యారని, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదర్శనలలో మహా కుంభమేళా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో సంక్రాంతి వేడుకలు, జీ 20 వ్యవసాయ మంత్రుల సమావేశం, సీఎం కప్ ప్రారంభోత్సవం, విశ్వంభర అవార్డు కార్యక్రమం, స్వతంత్ర భారత వజ్రోత్సవం, ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, సికా, దోమకొండ కోట, బన్సీలాల్‌పేటలో 17వ శతాబ్దపు స్టెప్‌వెల్ ప్రారంభోత్సవం, శ్రీ రామానుజాచార్య సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవం, ఖజురహో, కోణార్క్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నృత్యోత్సవాలు, తిరువనంతపురంలో నాట్యోత్సవం నృత్య నాటక ఉత్సవం ఉన్నాయి. ఆమె రుక్మిణి కృష్ణ, తెలంగాణ వైభవం వేదికలపై కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారని కొనియాడారు.



Next Story

Most Viewed