- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
UN: ఇరు దేశాలూ సంయమనం పాటించాలి: ఐక్యరాజ్యసమితి

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు భారత్, పాకిస్థాన్‌లు వీలైనంత సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పెహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన కుట్ర దాడి, ఆ తర్వాత నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను గమనిస్తున్నామని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్ చెప్పారు. ఉగ్రవాదుల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సామాన్య పౌరులపై దాడి చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రస్తుత పరిణామాల మధ్య రెండు దేశాలూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇరు దేశాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే, అర్థవంతమైన, పరస్పర సహకారంతో శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని మేము నమ్ముతున్నామని చెప్పారు. ఇదే సమయంలో సింధు జలాల ఒప్పందం రద్దు అంశంపై స్పందించిన గుటెరస్, ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిబంధనల గురించి సంయమనం పాటించాలని, ఇరు దేశాలు మెరుగైన చర్యలు తీసుకుంటాయనే నమ్మకం ఉందన్నారు. ఈ నెల 22న పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది ప్రాణాలను కోల్పోగా, చాలామంది గాయాల పాలయ్యారు. ఈ దారుణంపై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది.