Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో జతకట్టనున్న స్టార్ హీరో వైఫ్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

by sudharani |   ( Updated:2025-03-16 11:15:09.0  )
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో జతకట్టనున్న స్టార్ హీరో వైఫ్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రజెంట్ ‘విశ్వంభర’ (Vishvambhara) చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వశిష్ట (Vasishta) దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకోంటున్న ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఈ సినిమా అనంతరం.. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల‌(Srikanth Odela)తో ఓ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్.

అలాగే.. రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో కూడా మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ రానప్పటికీ.. తాజాగా మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ బజ్ (Interesting buzz) నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అదితిరావు హైదరీ(Aditi Rao Hydari)ని ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తమిళ్‌లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇక హీరో సిద్దార్థ్‌ను ఈ భామ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత అదితిరావు సినిమాలు అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఏకంగా మెగస్టార్ చిరంజీవి మూవీలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed