Laila Movie: ఎట్టకేలకు సారీ చెప్పిన నటుడు పృథ్వీరాజ్

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-13 13:56:54.0  )
Laila Movie: ఎట్టకేలకు సారీ చెప్పిన నటుడు పృథ్వీరాజ్
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో విశ్వక్ సేన్(Hero Vishwak Sen) నటించిన ‘లైలా’ సినిమా వేడుకల్లో నటుడు పృథ్వీరాజ్(Actor Prithviraj) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై తెలుగురాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.‘ లైలా’ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ఓ పార్టీకి చెందిన నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పృథ్వీరాజ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ‘లైలా’ మూవీ చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. హీరో విశ్వక్ సేన్‌తో పాటు చిత్ర యూనిట్ కూడా కూడా క్షమాపణలు చెప్పారు. తమ సినిమాను ఆదరించాలని సూచించారు. అయినా వివాదం ముగియకపోవడంతో తాజాగా నటుడు పృథ్వీరాజ్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ‘వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదు. నా వల్ల సినిమా తినకూడదు. ఇక నుంచి బాయ్‌కాట్ లైలా కాదు.. వెల్కమ్ లైలా అనండి’ అంటూ పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు.

కాగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌(Laila Movie Pre Release Function)లో 150 మేకలు.. చివరికి 11 మేకలు ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు. దీంతో వివాదం మొదలైంది. రేపు సినిమా విడుదల ఉండటంతో ఇవాళ పృథ్వీరాజ్ సారీ చెప్పారు. ఇదిలా ఉండగా.. లైలా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విశ్వక్ సేన్ నుంచి గతంలో ఎన్నడూ రాని సరికొత్త జానర్ సినిమా కావడంతో అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతకుముందు గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, ధమ్కీ సినిమాలతో ఆడియెన్స్‌ను అలరించాడు విశ్వక్.. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుందో చూడాలి.

Next Story