- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రతిధ్వనించే కథ, స్ఫూర్తినిచ్చే ప్రయాణం.. ‘పరదా’ సినిమాపై హైప్ పెంచుతున్న చిత్రబృందం

దిశ, సినిమా: అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’(parada). లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్(Darshan Rajendran), సీనియర్ నటి సంగీత(Sangeetha) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ శ్రీనివాసులు పివి, శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘పరదా’ షూటింగ్ పూర్తి అవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
అయితే ‘పరదా’చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్సాన్స్‌ను తెచ్చుకోగా.. తాజాగా, ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు మూవీ మేకర్స్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రిలీజ్ చేసిన పిక్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఇందులో అనుపమ, సంగీత, దర్శన రాజేంద్రన్ నవ్వుతూ ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపించారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘పరదా తో స్త్రీత్వం.. అనేక కోణాలను జరుపుకుంటున్నారు. ప్రతిధ్వనించే కథ, స్ఫూర్తినిచ్చే ప్రయాణం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది.