Naga Chaitanya: అలాంటి క్వశ్చన్ అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య

by Kavitha |
Naga Chaitanya: అలాంటి క్వశ్చన్ అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

అలా విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం శుక్రవారం భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్‌కి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తన మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా తండేల్ మూవీ ప్రమోషన్స్ కోసం సాయిపల్లవి సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు నాగ చైతన్య సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘మీరు యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు’ అని నాగ చైతన్య యాక్టింగ్ స్కిల్స్ పై కాస్త హేళన చేస్తూ అడిగాడు. దానికి చైతన్య స్పందిస్తూ.. ‘యాక్టింగ్ నేర్చుకోవడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నిరంతరం నేర్చుకుంటేనే ఉండాలి.

ఈ ప్రాసెస్‌కి ఫుల్ స్టాఫ్ ఉండదు. ఒకవేళ ఫుల్ స్టాప్ పెడితే కనుక నటుడిగా ఎదగడానికి పులిస్టాప్ పెట్టినట్లే, ఫ్యూచర్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. ఆ మాటకొస్తే నేను ఇంకా యాక్టింగ్ నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. గట్టిగా ఇచ్చి పడేసావ్ కదా అన్న అంటూ చైతన్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

Next Story