- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి కాకుండా అలా చేయకూడదంటూ నెటిజన్ కామెంట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కార్తీకదీపం నటి

దిశ, సినిమా: బుల్లితెర నటి కీర్తి భట్ (Keerthi Bhatt)తెలుగులో కార్తీకదీపం(Karthika Deepam), మనసిచ్చి చూడు వంటి సీరియల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss)లో పాల్గొని తన రియల్ లైఫ్ గురించి ప్రస్తావించి అందరి మనసులు దోచేసింది. కప్ గెలుచుకోలేనప్పటికీ సెకండ్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇక ఇంట్లో ఉన్నప్పుడే హీరో, డైరెక్టర్ విజయ్ కార్తీక్(Vijay Karthik)ను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ప్రకటించింది.
2023లో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్(Engagement) జరగ్గా.. కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. అతడితో కలిసి పలు వ్లాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. కానీ పెళ్లి డేట్ అనౌన్స్ చేయట్లేదు. తాజాగా, కీర్తి, కార్తీక్ ఓ పూజ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక అది చూసిన ఓ నెటిజన్ పెళ్లి కాకుండా అలా కలిసి పూజలు చేయడం తెలుగు సంప్రదాయం కాదు మిస్ కీర్తి భట్. కార్తీక్ ఈ విషయం మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా అని కామెంట్ పెట్టాడు. అది చూసిన కీర్తి ఘాటుగా స్పందించింది. ‘‘పెళ్లికి ముందు మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిదించే ముందు సరైన కారణాలు చెప్పండి’’ అని రిప్లై ఇచ్చింది.