రైతుపై పోలీస్ దాడి ఘటనపై విచారణ : సీఐ

by Shyam |   ( Updated:2023-08-18 15:35:02.0  )
రైతుపై పోలీస్ దాడి ఘటనపై విచారణ : సీఐ
X

దిశ, మహబూబ్‌నగర్: పీఏసీఎస్ ఆవరణలో రైతు కుటుంబంపై విచక్షణా రహితంగా దాడి చేసిన కానిస్టేబుల్‌పై విచారణకు ఆదేశించినట్టు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఘటన నాగర్ కర్నూల్‌ జిల్లాలోని కోడేరు మండలం కేంద్రంలోని పీఏసీఎస్ ఏర్పాటు చేసిన వరి సరఫరా కేంద్రం వద్ద బుధవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఐ విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. బుధవారం సీఐ మీడియాతో మాట్లాడుతూ.. వడ్ల సరఫరా కేంద్రం వద్ద రైతుపై కానిస్టేబుల్ మంగ్యనాయక్ దాడి ఘటన సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందనీ, ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాగ్మూలం సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చినా కొంతమంది దుందుడుకు స్వభావం కారణంగా పోలీసు శాఖకే మాయని మచ్చ తీసుకొస్తున్నారని అన్నారు. కానిస్టేబుల్ ఇక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి పౌరులపై దురుసుగా ప్రవర్తిస్తూ వివాదాలకు కారణమవుతున్నాడని, అతనికి ఇది కొత్తేమి కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed