Chiranjeevi Oxygen Bank: ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం

by vinod kumar |   ( Updated:2021-05-25 23:40:22.0  )
megastar Chiranjeevi
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దేశంపై విరుచుకుపడుతున్న సమయంలో స్టార్ హీరోలు కరోనాపై పోరాటానికి సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బ్లడ్ దొరక్క ప్రజలు మృతిచెందుతున్నారని బ్లడ్ బ్యాంకు ని ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క ఎంతోమంది మృతిచెందుతున్నారని ఆక్సిజన్ బ్యాంక్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే తెలిపారు. ఇక తాజాగా ఆయన తన మాటను నిలబెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజన్ అందించే బృహత్తర కార్యానికి చిరు ఈరోజు శ్రీకారం చుట్టారు. జిల్లా అభిమాన సంఘాల అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన ఈ బ్యాంకులను తాజాగా చిరు పర్యవేక్షించారు.

ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు వినియోగించుకోవచ్చు. రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదు” అంటూ చిరు ట్వీట్ చేశారు. అంతేకాకుండా చిరు మాట్లాడుతూ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఆక్సిజ‌న్ పంపిణీ నిరాటంకంగా కొనసాగుతుందని, ఇక్క‌డ స్కార్సిటీ వ‌ల్ల చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్ స‌న్ ట్రేట‌ర్లు ఆర్డ‌ర్ చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్ అవసరమున్నవారికి తరలించడం జరుగుతుందని తెలిపారు.

Next Story

Most Viewed