- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామ్ గురించి షాకింగ్ విషయం చెప్పిన చిన్మయి
దిశ, సినిమా: హిందీ డెబ్యూ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్2’కు వ్యతిరేకంగా సమంత అక్కినేని ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సమంత స్ట్రెంత్ పట్ల ప్రశంసలు కురిపించిన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. మీటూ మూమెంట్లో తనకు మద్దతు ఇచ్చినందుకు సామ్ ఏవిధంగా ఒత్తిడి ఎదుర్కొందో రివీల్ చేసింది. ‘కొందరు తాము ఏ విధంగా మద్దతిస్తున్నారో బయటకు చూపించరు, ఎటువంటి ట్వీట్ చేయరు, పబ్లిక్‌గా ఎలాంటి ప్రకటనా చేయరు. అయినా తాము చేయాల్సింది చేస్తారు. ఈ విషయంలో తన మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి చెందిన చాలా మంది ఎటువంటి స్టాండ్ తీసుకోకపోయినా, సమంత మాత్రం ప్రెజర్‌ను భరిస్తూనే తన కోసం నిలబడింది’ అని చెప్పింది. నిజానికి ఇండస్ట్రీలో ‘రాధా రవి’ లాంటి వ్యక్తిని ఎదుర్కోవడం అంత సులభం కాదని, అందుకే సామ్ ఎప్పటికీ నా రాక్‌స్టార్ అని పోస్టు చేసిన చిన్మయి.. ‘BTW- ఇది నన్ను నేను బాధితురాలిగా చూపెట్టుకునే ప్రయత్నం కాదు, నా జీవితంలో జరిగిన నిజం ఇది. మీరు నమ్మనంత మాత్రాన నిజం మారిపోదు’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది.
కాగా 2018 నవంబర్‌లో సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించలేదని చిన్మయిని యూనియన్ నుంచి బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే నటుడు, పొలిటిషియన్ రాధా రవి.. ఎటువంటి వ్యతిరేకత లేకుండా సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.