చైనాలో కొత్త రూల్: కుక్కలు తినడానికి కాదు… పెంచడానికి!

by vinod kumar |
చైనాలో కొత్త రూల్: కుక్కలు తినడానికి కాదు… పెంచడానికి!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ దెబ్బతో చైనా తన మనసు మార్చుకుంది. ఇక నుంచి కుక్కలు తినడానికి కాదు… పెంపుడు జంతువులు మాత్రమేనని చైనా వ్యవసాయం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటిని లైవ్ స్టాక్ జాబితా నుంచి తొలగించి పెంపుడు జంతువుల జాబితాలో చేర్చింది. చైనీయులు గబ్బిలాలు తినడం వల్లే కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వచ్చిందని అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు అడవిలో జంతువులను వేటాడటం, ఇతర జంతుజాలాన్ని పెంచడం అమ్మడం తినడాన్ని కూడా చైనా నిషేధించింది. ఆయా దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేసింది. త్వరలో దీనికి సంబంధించి శాశ్వతంగా చట్టం కూడా తీసుకురాబోతోంది. కుక్కలను తినడం చైనా చాలా అన్‌పాపులర్ అయిపోయింది. మొదటిసారిగా షెజెన్ నగరం గత నెల కుక్కలను తినడం మీద నిషేధం విధించింది. హుమానే సొసైటీ ఇంటర్నేషనల్ అనే జంతు సంరక్షణ గ్రూప్ ప్రకారం చైనాలో సంవత్సరానికి 10 మిలియన్ల కుక్కలను మాంసం కోసం చంపుతున్నారు. అంతేకాకుండా యులిన్ నగరంలో గత జూన్‌లో కుక్క మాంసం ఫెస్టివల్ కూడా జరిగింది. అయితే చైనా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని జంతు సంరక్షణ సంఘాలు కొనియాడుతున్నాయి.

Tags: China, Dogs, Pets, Wildlife, food, Festival, Delicacy

Advertisement

Next Story

Most Viewed