- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సరిహద్దులో మరోసారి చైనా కవ్వింపు చర్యలు
దిశ, వెబ్‌డెస్క్: సరిహద్దులో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని తిరిగి చెడగొట్టే పరిస్థితి కల్పించింది. ఇంతకుముందే భారత సరిహద్దుకు కూతవేటు దూరంలో భారీ సంఖ్యలో దళాలను తరలించిన చైనా, తాజాగా ప్రత్యేక దళాలతో విన్యాసాలను నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని చైనా మౌత్ పీస్ అయిన గ్లోబెల్ టైమ్స్ వెల్లడించింది. ‘ వివిధ రకాల్లో శత్రువుల ఏరివేత కార్యక్రమాలను దిగ్విజయంగా మా సైన్యం చేపట్టింది.
ఇందులో దాదాపు 4500 నుంచి 5000 వరకు దళాలు పాల్గోన్నాయని’ పేర్కొంది. ఈ విన్యాసాలకు స్నోఫీల్డ్-2021 పేరు పెట్టినట్లు తెలిపింది. దేశంలో చెంగ్దూ కేంద్రంగా ఉన్న సౌత్ థియెటర్ ఈ విన్యాసాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో చైనా ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఆయుధాలను ప్రయోగించి, పరీక్షించినట్లు కొన్ని వార్తా సంస్థలు చైనాను ఉటంకిస్తూ సమాచారాన్ని ప్రచురించాయి. ఇందులో ప్రధానంగా రాత్రిపూట శత్రువులు దాడి చేస్తే ఎలా స్పందించాలి, దాడులను తిప్పికొట్టడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.
ఈ డ్రిల్‌లో ఆధునాతన ఆయుధాలైన హౌవిట్జర్ గన్స్, మల్టీపుల్ రాకెట్ లాంఛర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ధ్వంసం చేసే ఆయుధాలు, పేరు వెల్లడించని ఆధునాతన హెలికాప్టర్లు, ఇన్‌ఫాంట్రీ వెహికిల్స్, అసాల్ట్ వాహనాలు, ఆంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ వాడినట్లు సీజీటీఎన్ తెలిపింది. ఈ విన్యాసాలన్నీ 6,000 వేల అడుగుల ఎత్తులో జరిపినట్లు తెలుస్తోంది. ఈ విన్యాసాల్లో ప్రధానంగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉపయోగించడానికి అనువైన టైప్-15 ట్యాంక్స్ వాడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.