- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాలో ఇకపై పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులు శిక్ష అనుభవించాల్సిందే..
దిశ, వెబ్‌డెస్క్ : చైనా అనగానే అందరికీ గుర్తొచ్చేది కమ్యూనిస్టు దేశం. కానీ కమ్యూనిజం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అక్కడి అధ్యక్షుడు జిన్‌పింగ్ పాలన చేస్తు్న్నాడని అందరికీ తెలిసిందే. సామ్రాజ్యవాద కాంక్షతో అన్ని దేశాలతో కయ్యం పెట్టుకుంటున్నాడు. కనిపించిన ప్రతీది చైనాదే అన్నట్టుగా పాలన సాగిస్తున్నాడు. ఆయన నియంతృత్వ పాలనలో ప్రపంచం మొత్తం చైనా మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కరోనా పరిస్థితుల తర్వాత చైనాలో నిరుద్యోగం భారీగా పెరిగినట్టు సమాచారం. విదేశీ కంపెనీలు తరలిపోవడమే అందుకు కారణంగా తెలిసింది. దీంతో అక్కడి యువత నేరాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువత తప్పు్దోవ పట్టుకుండా కఠినమైన చట్టాలు తేవాలని జిన్ పింగ్ ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదా కూడా తయారైందని సమాచారం.
దీని ప్రకారం దేశంలోని యువత ఎవరైనా ఇతరులతో చెడుగా ప్రవర్తించినా, నేరాలకు పాల్పడినా.. ముందు వారి తల్లిదండ్రులకు శిక్ష విధించనున్నారు అధికారులు. యువత తప్పు దారి పట్టడానికి కారణాలు అనేకం ఉంటాయని, అయితే, కుటుంబంలో మంచి, చెడుల గురించి తమ పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించకపోవడం వల్లే వారు తప్పుదారి పట్టవచ్చని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC) కింద శాసన వ్యవహారాల కమిషన్ ప్రతినిధి జాంగ్ టైవే తెలిపారు.
అక్కడి యువత ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్ బానిసలు అయ్యారని, గుడ్డిగా ఆన్‌లైన్ ఆటలు ఆడటం అనేది ‘ఆధ్యాత్మిక డ్రగ్’ వంటిదని వారు భావిస్తున్నారు. అందుకోసమే కుటుంబ విద్యా ప్రోత్సాహక చట్టాన్ని మరోసారి సమీక్షించేందుకు ఎన్పీసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఇకపై తల్లిదండ్రులు విరామ సమయంలో తమ పిల్లలతో టైం స్పెండ్ చేయాలని, వారిని ఆటలు ఆడేలా, వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలని స్పష్టంచేశారు.
ఇటీవల విద్యా మంత్రిత్వ శాఖ మైనర్ బాలురు పరిమితంగా గేమ్స్ ఆడాలని, అందుకోసం ప్రత్యేకంగా గంటలను కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. శుక్ర, శని మరియు ఆదివారాల్లో ఒక గంట మాత్రమే ఆన్‌లైన్ ఆటలు ఆడటానికి వీలు కల్పించారు. ఇకపోతే పిల్లలకు హోంవర్క్ తగ్గించడమే కాకుండా వారాంతం లేదా సెలవు దినాలలో ప్రధాన సబ్జెక్టుల ట్యూటరింగ్‌ను నిషేధించారు. ఇలా చేయడం వలన వారిలో ఒత్తిడి తగ్గుతుందని, ఫలితంగా ఇతరులతో చెడుగా, మర్యాద లేకుండా ప్రవర్తించడానికి ఆస్కారం తగ్గొచ్చని భావించారు.ఇక నేరాల విషయానికి వస్తే తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి, చెడు గురించి బోధించాలని.. చెడు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందో కూడా వివరించాలని విద్యా ప్రోత్సాహక చట్టంలో మార్పులు చేయనున్నట్టు తెలిపారు. దీనిద్వారా చైనా యువత సన్మార్గంలో నడిచే అవకాశం ఉంటుందని జిన్ పింగ్ ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది.