చైనా వ్యాక్సిన్ అక్షరాల రూ.10వేలు?

by vinod kumar |
చైనా వ్యాక్సిన్ అక్షరాల రూ.10వేలు?
X

దిశ, వెబ్డెస్క్: కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచదేశాలు (World countries) ఆ ప్రయత్నాల్లో తలామునకలయ్యాయి. ఇప్పటికే చైనా(China), రష్యా(Russia) కరోనాకు టీకా కనిపెట్టినట్లు ప్రకటించుకున్నాయి. అయితే, వాటి వినియోగంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తయారీ వ్యాక్సిన్ ఖరీదు రూ.10వేలు అని తెలుస్తోంది.ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా చాలా కంపెనీలు టీకా ధరలు సామాన్యుడికి పెనుభారం కాకుండా చూస్తున్నాయి. కానీ, చైనాకు చెందిన సినోఫార్మా (Cino pharma) నిర్ణయించిన ధర అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే మూడో దశ క్లీనికల్‌ ట్రయల్స్‌ మొదలుపెట్టిన ‘సినోఫార్మా’ వీలైనంత త్వరగా ఆ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

రెండు డోసులు 144 డాలర్లు..

సినోఫార్మా ఛైర్మన్‌ లి జింగ్‌జాన్‌ మాట్లాడుతూ.. తమ టీకా 1000 యువాన్లలోపే ఉంటుందని పేర్కొన్నారు. అంటే అమెరికా కరెన్సీ (American dollers)లో దాదాపు 144డాలర్లు. భారత కరెన్సీ (Indian currency) లో దీనివిలువ రూ.10,791. దీంతో పోల్చుకుంటే అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసే టీకా రెండు డోసుల ధర 37 డాలర్లలోపు ఉంటుందని సమాచారం. మన కరెన్సీలో రూ. 2,773. ఇక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న టీకా ధర రెండు డోసులు కలిపి ఆరుడాలర్లు.. అనగా మన కరెన్సీలో రూ.550. ఇక భారత్‌ బయోటెక్‌ (Bharath biotech) తయారు చేస్తున్న ‘కోవాగ్జిన్‌’ ధర మిగిలిన వాటి కంటే చౌకగానే ఉంటుందని ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్ల ఇప్పటికే ప్రకటించారు.

ఎన్ని టీకాలు.. ఏయే దశల్లో ఉన్నాయి:

మొత్తం 170 బృందాలు (170 teams) టీకాల తయారీలో నిమగ్నమయ్యాయి. వీటిల్లో 138 ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌, 25 ఫేజ్‌-1లో, 15 ఫేజ్‌-2లో, 7 ఫేజ్‌-3లో ఉన్నాయి. మూడో దశకు చేరుకున్న వాటిలో ఆక్స్‌ఫర్డ్‌, ఫైజర్‌, మోడెర్నా, సినోవాక్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌- సినో ఫార్మా, వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌-సినో ఫార్మా సంస్థలు ఉన్నాయి.

రష్యా వ్యాక్సిన్‌ ధర గోప్యం..

కరోనా టీకా ధరను రష్యా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే దీని ధరను కూడా ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌ కంపెనీలు కూడా ఈ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు రష్యా ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్‌ వెల్లడించారు. భారత్‌లో తయారైతే వీటి ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed