ఆ కథనాలు ప్రచారం చేయొద్దు.. మీడియాతో ఎన్వీ రమణ

by Shamantha N |   ( Updated:2021-08-18 05:44:34.0  )
nv-ramana
X

న్యూ ఢిల్లీ: కొలిజియంలో 9 మంది న్యాయమూర్తుల నియమాకంపై మీడియాలో వస్తున్న వార్తలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. ఆ నివేదికలు బాధ్యత రహితమైనవని ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తుల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ రోజు కొలిజీయం సమావేశంపై మీడియాలో ఊహాజనిత కథనాలు రావడం దురదృష్టకరమని అన్నారు. జస్టిస్ నవీన్ సిన్హా రిటైర్మెంట్ సందర్భంగా సీజేఐ అధ్యక్షతన బెంచ్ సమావేశమైంది.

‘కొలిజియం సమావేశం కొనసాగుతుంది. న్యాయవాదుల ఎంపిక ప్రక్రియ పవిత్రమైనది. లేనిపోని ఊహగానాలను ప్రచారం చేసి కోర్టు సమగ్రతకు, గౌరవానికి హాని కలిగించొద్దని’ అన్నారు. ఇలాంటి బాధ్యతరహితమైన రిపోర్టింగ్ వల్ల కొందరి జీవితాలు దెబ్బతింటాయని తెలిపారు. ‘మేము కోర్టుకు జడ్జిల ఎంపిక చేయాల్సిన అవసరముందని మీకు తెలుసు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి. నియామక ప్రక్రియ ఎంతో పవిత్రమైనది, గౌరవంతో కూడుకున్నది. మీడియా మిత్రులు ఆ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఒక వ్యవస్థగా మీడియా స్వేచ్ఛను, వ్యక్తిగత హక్కులకు ఎంతో గౌరవమిస్తాం’ అంటూ మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థలు ఊహాగానాలను ప్రచారం చేయకుండా సంయమనం పాటించేలా చూడాలన్నారు. వీరే సుప్రీంకోర్టుకు ప్రధాన బలమని పేర్కొన్నారు.

విలువైన సహోద్యోగిని కోల్పోతున్నా…

వీడ్కోలు సందర్భంగా హాజరవలేనందుకు క్షమించాలని జస్టిస్ సిన్హాను కోరారు. ‘నా బాధను సిన్హా అర్ధం చేసుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. జస్టిన్ సిన్హా బార్, బెంచ్ ద్వారా సూటిగా, నిజాయితీగా వ్యవహరిస్తారని తెలుసు. న్యాయమూర్తిగా అతను ఎప్పటికి గుర్తుండిపోతారు. తక్కువ మాట్లాడినప్పటికీ, ఆయన మాటాల్లో లోతైన విశ్లేషణ ఉంటుందని తెలిపారు. వ్యక్తిగతంగా సిన్హా రిటైర్మెంట్ కొంత బాధిస్తోంది. మేము ముఖ్యమైన గొంతును, విలువైన సహోద్యోగిని కోల్పోతున్నాం’ అని ఎన్వీ రమణ తెలిపారు.

Advertisement

Next Story