రండి బాబూ రండి.. నచ్చినంత చికెన్ తినండి

by srinivas |   ( Updated:2020-02-20 00:55:43.0  )
రండి బాబూ రండి.. నచ్చినంత చికెన్ తినండి
X

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఎంత భయపెడుతోందో తెలిసిందే. చైనాలో కరోనా మరణాలు రెండు వేలను దాటేయగా.. వివిధ దేశాలు చైనా ప్రయాణాన్ని నిషేధించాయి. కరోనా కష్టాలు చైనీయులనే కాదు.. భారతీయులను కూడా పట్టి పీడిస్తున్నాయి. కరోనా బయటపడిన తరువాత సోషల్ మీడియాలో చికెన్ ద్వారా కరోనా వ్యాపిస్తుందంటూ ప్రచారం జరిగింది. దీంతో చికెన్ అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. ఈ కష్టనష్టాల నుంచి గట్టెక్కేందుకు కృష్ణా జిల్లా నందిగామ చికెన్ వ్యాపారులంతా చికెన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గాంధీ సెంటర్‌లో చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. చికెన్ తినడం వల్ల కరోనా వ్యాధి రాదని.. నచ్చినంత చికెన్ ఇష్టంగా తినవచ్చంటూ ప్రచారం ప్రారంభించారు. పలు స్టాళ్లు ఏర్పాటు చేసి చికెన్ వంటకాలను సరసమైన ధరలకు అందించారు.

Advertisement

Next Story