విచారణకు హాజరైన కమల్ హాసన్

by Shyam |
విచారణకు హాజరైన కమల్ హాసన్
X

‘భారతీయుడు – 2’ సినిమా ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోయిన ఘటనలో ముగ్గురు సినీ కార్మికులు చనిపోగా .. పలువురికి గాయాలయ్యాయి. దీంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడగా… చెన్నై ఈవీపీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదంపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27న దర్శకుడు శంకర్‌ను పిలిపించి విచారించారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. దాదాపు రెండు గంటల పాటు విచారించిన అనంతరం ఆయనను ఇంటికి పంపించేశారు. ఇప్పుడు హీరో కమల్ హాసన్‌ను కూడా విచారించారు పోలీసులు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు.

ఫిబ్రవరి 19న జరిగిన ఈ ప్రమాదంలో మధు, చంద్రన్, కృష్ణ అనే ముగ్గురు టెక్నిషియన్లు చనిపోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులకు రూ. కోటి రూపాయల పరిహారాన్ని అందించేందుకు ముందుకొచ్చారు కమల్ హాసన్. ఆ ప్రమాదంలో నేను చనిపోయినా బాగుండేదని దర్శకులు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story