నితిన్ ‘చెక్’ పెట్టేసినట్లే..

by Anukaran |   ( Updated:2021-02-03 09:06:37.0  )
నితిన్ ‘చెక్’ పెట్టేసినట్లే..
X

దిశ, సినిమా : విధిరాతను మార్చగలను అనే ధీమాతో ఉన్న ఓ యువకుడు ఉగ్రవాదిగా ఎలా ముద్రవేయబడ్డాడు? ఎవరినైనా ఎదిరించగలిగే సత్తా ఉన్న తను.. ఉరిశిక్ష నుంచి తప్పించుకోగలిగాడా? చెస్‌లో ప్రావీణ్యం ఉన్న తను శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆ గేమ్‌ను ఎలా ఉపయోగించుకున్నాడు? ప్రత్యర్థులకు ఎలా ‘చెక్’ పెట్టాడు? ఇంతకీ తన గతం ఏంటి? ఇన్ని ప్రశ్నలతో కూడిన యంగ్ హీరో నితిన్ ‘చెక్’ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా ఉంది. రకుల్ లాయర్‌గా కీలక పాత్రలో కనిపిస్తుండగా.. టెర్రిరిస్ట్‌గా ముద్రపడిన నితిన్‌కు క్షమాభిక్ష ఇప్పించేందుకు ఎలాంటి హెల్ప్ చేసింది? గర్ల్ ఫ్రెండ్ ప్రియా ప్రకాశ్ వారియర్ పాత్ర ఏంటి? సిమ్రన్ చౌదరికి నితిన్‌కున్న సంబంధం ఏంటి? అనేవి ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కాగా.. ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తుండగా.. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ కాబోతుంది.

Advertisement

Next Story