‘పేదల పక్షాన చివరివరకూ పోరాడిన గొప్ప వ్యక్తి చేగువేరా’

by Shyam |
Cheguevara
X

దిశ, వనపర్తి: ప్రపంచ విప్లవకారుడు చేగువేరా.. యువతరానికి స్ఫూర్తి అని ప్రజా వాగ్గేయకారుడు రాజా రామ్ ప్రకాష్ అన్నారు. సోమవారం చేగువేరా 93వ జయంతి కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో, ఇంజినీరింగ్ విద్యలో పట్టా పుచ్చుకొని, బహు బాషలలో అనర్గలంగా మాట్లాడే ప్రావీణ్యం, రచయితగా, కవిగా రాణించిన వ్యక్తి చేగువేరా అన్నారు. ప్రజలను ఆర్థిక, రాజకీయ, సాంఘిక దోపిడీ నుంచి విముక్తి కోసం, సామ్రాజ్యవాదాన్ని అంతమొందించాలని పోరాటం చేసిన గొప్ప విప్లవకారుడు అని వెల్లడించారు. జీవితాంతం ప్రజలకోసం జీవించిన మహానాయకుడు అని తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచినప్పుడే చేగువేరా ఆశయాలు సాధించగలం అని అన్నారు.

Next Story

Most Viewed