- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన తరువాత తొలిసారి చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా టీడీపీ ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని బాబు భావిస్తున్నారు. ఇంతకీ బాబు పర్యటన ఎందుకు? ఏమాశించి ఆయన పర్యటిస్తున్నారు? అన్న వివరాల్లోకి వెళ్తే…
విభాజిత ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం విశాఖపట్టణం. అంతర్జాతీయ స్థాయి రాజధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఏకైక నగరం విశాఖపట్టణం. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం విశాఖపట్టణమే ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉంటుందని అంతా భావించారు. అయితే రాష్ట్రానికి చివరన ఉంటుంది, రాయసీమ వాసులకు భౌగోళికంగా దూరంగా ఉంటుందన్న నెపంతో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆ తరువాత అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చేసేందుకు ప్రణాళికలు రచించారు. అమరావతి కేంద్రంగా పరిశ్రమలు, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ ఇలా ప్రతి రంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేశారు.
భౌగోళికంగా అంధ్రప్రదేశ్‌కు చివరన ఉత్తరాంధ్ర ఉంటుంది. దీంతో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాదు వారికి దూరంగా ఉంది. అయినప్పటికీ వారెవ్వరూ జీవనోపాధి కోసం హైదరాబాదు రావడం మానలేదు. రాజధానిలో పనులు పూర్తి చేసుకోవడం కూడా మానెయ్యలేదు. దీంతో చంద్రబాబు చేస్తున్న దూరం అన్న వాదనలో వాస్తవమెంతో ప్రజలకు తెలిసిపోయింది. మరోవైపు వైజాగ్ అభివృద్ధి చెందుతున్న నగరం, తుపానుల తాకిడి ఎక్కువ అందుకే అక్కడ రాజధానికి అనుకూలం కాదు అంటూ టీడీపీ వాదిస్తోంది.
విశాఖపట్టణానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో తవ్విన బంకర్లు రుషికొండ పరిసరాల్లో కనిపిస్తాయి. ఉత్తరాంధ్రులకు ప్రధాన పట్టణం వైజాగ్ అయినప్పటికీ అక్కడ జాతీయ సంస్థలైన స్టీల్ ప్లాంట్, పోర్ట్, షిప్ యార్డ్, హెచ్‌పీసీఎల్, జింక్, బీహెచ్‌పీవీ వంటి సంస్థలున్నాయి. వీటిల్లో అధికశాతం ప్రభుత్వోద్యోగులే తప్ప ఇతరుల శాతం స్వల్పం దీంతో ఇతరకు అక్కడ ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో వైజాగ్ రాజధాని అయితే పెట్టుబడులు, పరిశ్రమలకు వైజాగ్ కేంద్రమవుతుందని, తద్వారా ఉపాధి లభిస్తుందని ఉత్తరాంధ్రవాసులు భావిస్తున్నారు. దీనికి టీడీపీ అడ్డుపడుతోంది.
నేవీ హెడ్ క్వార్టర్స్ వైజాగ్ కేంద్రంగానే ఉన్నాయి. అందుకే వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించేందుకు నేవీ అభ్యంతరం చెబుతుందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వైజాగ్‌లో సింధియా కేంద్రంగా పోర్టు, నేవల్ బేస్, షిప్‌యార్డ్ సంస్థలు ఉన్నాయి. చావుల మదుం జంక్షన్ నుంచి మల్కాపురం వరకు అంతా నేవీ నియంత్రణలోనే ఉంటుంది. ఆ ప్రాంతం తప్ప ఇతర ప్రాంతాలతో నేవీ సిబ్బందికి పెద్దగా సంబంధాలు ఉండవు. ఎయిర్‌పోర్టు హెచ్‌పీసీఎల్‌కు దగ్గరగా ఉండడంతో భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని నేవీ భయపడుతోంది.
నేవీ ఎయిర్ పోర్టు విషయంలో అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఎయిర్ పోర్టును భోగాపురం మారుస్తామంటూ గత ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో వైజాగ్ రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని వైఎస్సార్సీపీ చెబుతోంది. తుపానులు వైజాగ్‌ను అతలాకుతలం చేస్తాయని, అందుకే అక్కడ రాజధాని సురక్షితం కాదని టీడీపీ నేతలు, నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్నేళ్లుగా వైజాగ్ అభివృద్ధి చెందుతోంది, మరింత విస్తరించబడుతోందే తప్ప కుచించుకుపోవడం లేదు కదా? అంటూ వైజాగ్ వాసులు ప్రశ్నిస్తున్నారు.
వైజాగ్ రాజధాని అయితే వైఎస్సార్సీపీ నేతలు అక్కడ భూములు కొనుగోలు చేసి అరాచకం సృష్టిస్తారని టీడీపీ ఆరోపిస్తోంది. భూములు కొనుగోలు చేయాలంటే అమ్మకం దారులు, కొనుగోలు దారుల మధ్య ఒప్పందాలు సరిపోతాయని, వైజాగ్‌లో ఎవరైనా భూములు కొనుగోలు చేయవచ్చని, అందులో అభ్యంతరమేముంటుందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. అమరావతే ముద్దు అంటున్న టీడీపీ నేతలు అక్కడే ఉండవచ్చుకదా? వైజాగ్ ఎందుకు రావాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబునాయుడుకి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమన్న సంగతి తెలుసు, ఉత్తరాంధ్రులు సాత్వీకులన్న విషయం కూడా తెలుసు, మరోవైపు వైజాగ్ ఆయనకు ఇష్టమైన ప్రాంతమనీ చెబుతుంటారు.. కానీ వైజాగ్ రాజధానికి మాత్రం పనికిరాదంటారు? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? అంటూ వైఎస్సార్సీపీ నేతలు నిలదీస్తున్నారు.