- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన గెలుపు చారిత్రాత్మకం కావాలి : చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో : ఏడాదిన్నర పాలనలో వైసీపీ నాయకులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నిరంగాల్లో విఫలమయ్యారు, అన్నివిషయాల్లో అప్రదిష్ట పాలయ్యారు. అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. వీటన్నింటికీ చెక్పెడుతూ తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు చారిత్రాత్మకం కావాలని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. గురువారం తిరుపతి ఉప ఎన్నిక గురించి చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ర్టంలో మహిళలు, మైనార్టీలు, దళితులపై పెరుగుతున్న దాడుల గురించి వివరించారు. బీసీలపై తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు అంతే లేదన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడిపై అక్రమ కేసులు బనాయించినట్లు పేర్కొన్నారు. టీడీపీకి వెన్నెముకగా బీసీలు ఉంటారన్న అక్కసుతో కక్ష సాధిస్తున్నట్లు ఆరోపించారు.
వైసీపీ బాధిత వర్గాలన్నీ ఏకమై తిరుపతి ఉప ఎన్నికలో ఆపార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పారు. టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలన్నారు. పట్టుదలగా పనిచేస్తే విజయం తథ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు అమరనాథ్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, పులివర్తి నాని, సుధాకర్ రెడ్డి, సుబ్రమణ్యం పాల్గొన్నారు.