- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగన్ ఎక్కడున్నాడంటూ నిప్పులు చెరిగిన బాబు
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైజాగ్‌లో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ట్విట్టర్ మాధ్యమంగా బాబు ప్రశ్నించారు. జరిగిన దుర్ఘటనతో భయకంపితులైన విశాఖ ప్రజలు రోడ్లపైనే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు వీధుల్లోకి వచ్చి, నిరసనలు తెలుపుతున్నారని, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు తమవారి మృతదేహాల పక్కన దీనంగా రోదిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘటనకు బాధ్యులైన ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని, కనీసం ఒక్క ఆస్తిని కూడా జప్తు చేయలేదని, ఇంతకీ వైఎస్ జగన్ ఎక్కడున్నాడు? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. తమ సర్వస్వం అనుకున్న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కన్నకూతురుని కోల్పోయిన ఓ మహిళ రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనికంగా కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని ఆమె నిలదీసిన వీడియోను షేర్ చేస్తూ, కన్నకూతురుని కోల్పోయిన తల్లి బాధను చూసి నా హృదయం బద్దలవుతోంది. తన ప్రపంచం కూతురే అని ఆమె చెబుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.