వైన్స్ వద్ద బారులు చూసి షాకయ్యా: చంద్రబాబు

by srinivas |
వైన్స్ వద్ద బారులు చూసి షాకయ్యా: చంద్రబాబు
X

అమరావతి: ఏపీలో మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర మందుబాబులు బారులు తీరడంపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. ‘ఏపీలో మద్యం దుకాణాల ముందు ప్రజలు బారులు తీరడం చూసి షాకయ్యాను. ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏపీలో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో ఇలా.. సామాజిక దూరం నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరం’ అని వెల్లడించారు.

Tags: chandrababu, lquor shop, opend, ap news

Next Story

Most Viewed