- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫుట్‌బాల్ లీగ్‌కు సిద్ధమవుతోన్న 'చైనా'
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డాయి. రాబోయే రెండు మూడు నెలల్లో కూడా మళ్లీ క్రీడా పోటీలు మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనీస్ సూపర్ లీగ్ (సీఎస్ఎల్) ఫుట్‌బాల్ పోటీలను జూన్ లేదా జులైలో నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. కరోనా కారణంగా ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ పోటీలు వాయిదా పడ్డాయి. కానీ, ఇప్పుడు చైనాలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావించి లీగ్ నిర్వహించాలని క్లబ్ చైర్మన్ హువాంగ్ షెంఘువా స్పష్టం చేశారు. ‘ఫిబ్రవరి నెలలో ఉన్నట్లు అసాధారణ పరిస్థితులు ఇప్పుడు లేవని.. చైనాలో ఆందోళన చెందాల్సినంత విధంగా కరోనా ప్రభావం చూపడం లేదని.. కాబట్టి జూన్ చివర్లో కానీ, జులై నెల మొదటి వారంలో కానీ ఈ లీగ్ ప్రారంభించాలని గ్వాంగ్జౌ ఆర్ అండ్ ఎఫ్ చైర్మన్ హువాంగ్ షెంఘువా అన్నారు. 5 నెలల ఆలస్యంగా నిర్వహిస్తున్నా సరే.. లీగ్ పూర్తి స్థాయిలో జరుగుతుందని.. సీఎస్ఎల్ నిర్వహణ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఎన్నో లీగ్‌లకు ఊపిరిపోసినట్లు అవుతుందని చైనా మీడియా పేర్కొంది.
‘కరోనా ప్రభావం ముగిసిన తర్వాత అన్ని జాగ్రత్తలతో సీఎస్ఎల్ నిర్వహించబోతున్నాం కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల తర్వాత క్రీడా లీగ్స్ ఎలా నిర్వహించాలనే దానిపై ఇతరులకు స్పష్టత వస్తుందని’ క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వాయిదా పడిన యూరోపియన్ లీగ్స్ నిర్వాహకులకు సీఎస్ఎల్ నిర్వహణ ఒక పాఠంలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. చైనాలో ప్రస్తుతం కరోనా కేసులు పూర్తిగా కట్టడి అయ్యాయని.. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వస్తున్న వారివేనని వైద్యాధికారులు చెబుతున్నారు. కాబట్టి.. చైనీస్ సూపర్ లీగ్‌ను ఎటాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించవచ్చని భావిస్తున్నారు. కాగా, లీగ్ మ్యాచులకు అభిమానులను అనుమతిస్తారా లేదా ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారా అనే దానిపై ఇంకా నిర్వహకులు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ ఖరారు చేసే పనిలో ఉన్నారు. అంతా సవ్యంగా జరిగితే చైనా సూపర్ లీగ్ క్రీడల నిర్వహణకు ఒక బెంచ్ మార్క్ సృష్టించడం ఖాయం.
Tags : Football league, chaina, CSL, Sports Analysts