- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వాట్సాప్ గ్రూపుల్లో సీఎం పేరుతో తప్పుడు ప్రచారం..
by Sumithra |

X
దిశ, క్రైమ్‌బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు ఒక మైనర్‌తో పాటు మరొకరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 17న తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్ పేరుతో నడుపుతున్న వాట్సాప్ గ్రూప్‌లో సీఎం పేరుతో తప్పుడు వార్త ఒకటి పోస్ట్ అయ్యింది. దానిని ఓ మైనర్ ఇతర గ్రూపులకు కూడా షేర్ చేశాడు.
దీనిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వనస్థలిపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడితో పాటు తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్ గ్రూపుకు తప్పుడు వార్తను పోస్ట్ చేసిన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామానికి శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.
Next Story