- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బ్లాక్ పాంథర్’ స్టార్‌ను వరించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డుల్ని కొల్లగొట్టిన ‘బ్లాక్ పాంథర్’ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన చాడ్విక్ బోస్‌మన్ పెద్ద పేగు క్యాన్సర్‌తో పోరాడుతూ 2020 ఆగస్టు 28న చనిపోయిన విషయం తెలిసిందే. చాడ్విక్ ఓవైపు క్యాన్సర్‌తో పోరాడుతూనే ‘మార్షల్, ద 5 బ్లడ్స్, మా రైనీస్ బ్లాక్ బాటమ్’ వంటి ప్రెస్టీజియస్ చిత్రాల్లో నటించారు. కాగా ఆయన చనిపోయిన్పటికీ ఆ లెగసీ మాత్రం కంటిన్యూ అవుతోంది. తాజాగా ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ప్రకటించగా.. ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రంలో నటనకు గాను బోస్‌మన్‌ను ఉత్తమ నటుడి అవార్డు వరించడంతో ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక మార్చి1 (సోమవారం)న వర్చువల్‌గా జరిగింది. ఈ వేడుక లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ నుంచి జరగ్గా, వివిధ దేశాల నుంచి నామినీలు పాల్గొన్నారు. టీనా ఫే, అమీ పోహ్లెర్ ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని రెయిన్‌బో రూమ్, లాస్ ఏంజిల్స్ బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ హిల్టన్ నుంచి నిర్వహించారు. ఫిబ్రవరి 3న గోల్డెన్ గ్లోబ్స్‌కు నామినీలు వెల్లడి కాగా, హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్‌ఎఫ్‌పీఏ) 2020-21 కాలంలో విడుదలైన సినిమాలు, టీవీ షోలకు సంబంధించిన అవార్డులు ప్రకటించింది. ఇందులో బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో ‘నోమడ్‌ల్యాండ్’ అవార్డు గెలుచుకోగా, బెస్ట్ యాక్టర్‌గా చాడ్విక్ నిలిచాడు. ఈ పురస్కారాన్ని చాడ్విక్ భార్య సిమోన్ బోస్‌మన్ స్వీకరించారు. ఈ సమయంలో ఆమె కన్నీటి పర్యంతమైన సిమోన్.. తను మనందరికీ స్ఫూర్తి, ఆయన జ్ఞాపకాలు మనందరిలోనూ ఉంటాయని ఆమె పేర్కొంది. ఈ ఉద్వేగభరిత క్షణంలో చాడ్విక్‌ను అభిమానులు మిస్ కాగా, సోషల్ మీడియాలో ‘ద కింగ్ నెవర్ డైస్. వి మిస్ యూ’, ‘టాలెంటెడ్ మ్యాన్ గాన్ టూ సూన్’ ‘వెల్ డిజర్వ్‌డ్’ అంటూ అభిమానులు అతడి జ్ఞాపకాలు, సందేశాలతో సోషల్ మీడియాను నింపేశారు.
సౌత్ కరోలినాలోని అండర్సన్ అనే ప్రాంతంలో జన్మించిన బోస్‌మన్, 2003లో ‘థర్డ్ వాచ్’ అనే ఎపిసోడ్ ద్వారా మొదటిసారి తెరపై కనిపించాడు. ఇక ప్రముఖ బేస్‌బాల్ ఆటగాడు జాకీ రాబిన్‌సన్ జీవితం ఆధారంగా 2013లో తెరకెక్కిన ‘42’ చిత్రంలో రాబిన్‌సన్ పాత్ర పోషించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 2016లో వచ్చిన ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’ సినిమాతో బోస్‌మన్ స్టార్ హీరోగా అవతరించగా, 2018లో వచ్చిన ‘బ్లాక్ పాంథర్’ అతడ్ని మరోస్థాయికి తీసుకెళ్లింది. 2018లో వచ్చిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, 2019లో విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. ఆయన చివరి చిత్రమైన ‘ద 5 బ్లడ్స్’ జూన్‌లో ఓటీటీ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.