- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోండి: చాడ
by Shyam |

X
దిశ, జడ్చర్ల: పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయడంలో సర్కార్ వైఫల్యం చెందిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం సమీపంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను సీపీఐ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. సమీక్షలతో కాలయాపన కాకుండా నిధులు కేటాయించి సత్వరం పనులు పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీని నియంత్రించాలని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చాడ వెంకట్ రెడ్డి సూచించారు.
Next Story