ఉద్యోగాల కోత తప్పదు!

by Harish |
ఉద్యోగాల కోత తప్పదు!
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 వ్యాప్తి కావడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ పరిణామాలతో ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం కనబడుతోంది. అనే సంస్థలు, వ్యాపారాలు ఆదాయం లేక, డిమాండ్ పూర్తీగా నిలిచిపోయింది. అయితే, ఈ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో ఉద్యోగాల కోత తప్పేలా లేదని కార్పొరేట్ సంస్థలు భావిస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా పలు కంపెనీల సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్టు సమచారం. దేశవ్యాప్తంగా పలు కీలక రంగాల్లోని సంస్థల 200 మంది సీఈవోలను ఈ సర్వేలో ప్రశ్నించారు. జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి మధ్య ఆదాయంలో 10 శాతం, లాభాల్లో 5 శాతం తక్కువగా ఉందని, ఈ మార్పు స్పష్టంగా కనబడుతోందని ఎక్కువమంది భావించారు. ఈ స్పష్టమైన మార్పు కారణంగా దేశ జీడీపీ వృద్ధిపై కోవిడ్-19 ప్రభావం ఎంతమేరకు ఉందనేది ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న సగానికిపైగా కంపెనీలు..రానున్న కాలంలో తమ రంగాల్లోని సంస్థల్లో ఉద్యోగాల కోతలు తప్పవని అంచనా వేసినట్టు సర్వే నివేదిక వెల్లడించింది.

Tags : CII Snap Poll, Confederation Of Indian Industry, CII Poll On 200 CEOs, Revenues, Profits, COVID-19 Outbreak, 21-Day Lockdown

Advertisement

Next Story

Most Viewed