- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ 2.0 వ్యూహం ఇదేనా?
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ 2.0 వెనుక కరోనాకు సమర్థవంతంగా చెక్ పెట్టే వ్యూహమున్నట్టు తెలుస్తున్నది. రెండో దశ లాక్‌డౌన్‌లో కాస్త సడలింపులుంటాయని అనేక విశ్లేషణలు వచ్చాయి. కానీ, దీనిపై మోడీ ఓ మెలిక పెట్టారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాతే లాక్‌డౌన్ మినహాయింపులపై నిర్ణయాలుంటాయని తెలిపారు. దీంతో మరో చర్చ మొదలైంది. అయితే, ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం.. ఈ తేదీ వెనుకాల పకడ్బందీ వ్యూహమున్నది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సుమారు మూడు లక్షల మందిలో కరోనా పాజిటివ్‌గా తేలేవారి సంఖ్యపైనే ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి.
లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికి కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం సులువైంది. వాటిని ప్రత్యేక జోన్‌గా ప్రకటించి ఏకాంతంగా ఉంచే వీలు కలిగింది. రెడ్‌జోన్‌లుగా ఐడెంటిఫై చేసి ఐసొలేట్ చేయడం సాధ్యమైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 3,23,000ల మంది ఐతే ఇంటిదగ్గరే ఐసొలేషన్‌లో ఉన్నారు లేదా ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో ఉన్నారు. మోడీ చెప్పిన ఏప్రిల్ 20 నాటికి సర్కారు గుర్తించిన లేదా కరోనా కేసులు నమోదవుతున్న ఏరియాల్లో వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తారు. కొత్తగా నమోదవుతున్నాయా? లేక ఉన్నవి నెగెటివ్‌గా తేలుతుందా? అనే విషయాలపై ఒక అంచనాకు వస్తారు. వచ్చిన ఫలితాల ఆధారంగా ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఏ ఏరియాల్లో నిబంధనలను సడలించాలి? ఏ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలన్నది నిర్ణయించబోతున్నట్టు తెలుస్తున్నది. మహారాష్ట్రలో అత్యధికంగా 66,311 మంది ఐసొలేషన్‌లో ఉండగా.. ఉత్తరాఖండ్‌లో 56,166, రాజస్తాన్‌లో 35,843 మంది, ఉత్తరప్రదేశ్‌లో 31,158 మంది ఐసొలేషన్‌లో ఉన్నారు.
Tags: lockdown, isolation, containment, zone, restrictions, modi, quarantine